దూరంగా ఉండాల్సిందే!
దూరంగా ఉండాల్సిందే!
దుర్జనః పరిహర్తవ్యో విద్యయాఽలంకృతోఽపి సన్ ।
మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః ॥
శిరస్సు మీద మణి ఉంది కదా అని సర్పాన్ని దగ్గరకి తీయలేం కదా! అలాగే దుర్గార్ముడికి ఎంత విద్య ఉన్నా అతనికి దూరంగా ఉండాల్సిందే! విద్య, విజ్ఞానం, ధనం, కీర్తి వంటి ఎన్ని సంపదలు ఉన్నా... అంతః సౌందర్యం లేని మనిషికి దూరంగా ఉండాలన్నది శతకకారుని భావన.
..Nirjara